చంద్రబాబు సత్య హరిశ్చంద్రుడని సపోర్ట్ చేయలేదు: నాగబాబు
- చంద్రబాబు-జగన్ ఇద్దరూ అవినీతి పరులే
- అనుభవం ఉన్న నాయకుడని చంద్రబాబుకు మద్దతు
- అప్పట్లో పవన్‌కు వేరే ఆప్షన్ లేకుండా పోయింది
ప్రజా సమస్యలపైనే చంద్రబాబుతో పవన్ కలిశారని పేర్కొన్న నాగబాబు ఎన్నికల తర్వాత చాలా విషయాల్లో చంద్రబాబుతో విభేదించినట్టు చెప్పారు. అంతేతప్ప టీడీపీతో కలిసి పనిచేశారని చెప్పడం తప్పన్నారు. 2014లో వైసీపీకి వేవ్ ఉందని, టీడీపీకి లేదని అన్నారు. ఆ గాలిని పవన్ టీడీపీవైపు టర్న్ చేశారని నాగబాబు పేర్కొన్నారు.