praja shanti party: పాతజ్ఞాపకాలను తలచుకుని కేఏ పాల్ భావోద్వేగం!

  • మళ్లీ నన్ను అరెస్టు చేసేందుకు కుట్రలు
  • వేల కోట్లు వసూలు చేశానని నాపై అసత్య ప్రచారం 
  • వైసీపీ, జనసేన ఓట్లను చీల్చేందుకు నేను రాలేదు
ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ పాతజ్ఞాపకాలను తలచుకుని భావోద్వేగం చెందారు. విజయవాడలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన ‘మీట్ ది ప్రెస్’ లో ఆయన మాట్లాడుతూ, మన ఇద్దరిలో ఒకరిని చంపి, మరొకరిని జైల్లో పెడతారని తన అన్న గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకున్న ఆయన కంటతడిపెట్టారు. తనను మళ్లీ అరెస్టు చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు.

రూ.30 వేల కోట్లు వసూలు చేశానని తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ, జనసేన ఓట్లను చీల్చేందుకు తాను రాలేదని, కొందరు అంటున్నట్టుగా చంద్రబాబు వదిలిన బాణాన్ని కాదని స్పష్టం చేశారు. తనకు మెంటల్ ఉందని, తనను ఎర్రగడ్డ తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. ఒకవేళ తనను చంపితే, ట్రస్టు డబ్బులన్నీ పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా వీలునామా రాసి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు ఇస్తానని కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
praja shanti party
ka paul
Chandrababu
YSRCP
jana sena
Telugudesam

More Telugu News