india: మోదీని ఎదుర్కొనేందుకు అవినీతి పార్టీలన్నీ ఏకమవుతున్నాయి: పురందేశ్వరి

  • కేంద్ర పథకాలను టీడీపీ తమవిగా చెప్పుకుంటోంది
  • ఏపీకి కేంద్రం అన్ని విధాలా సాయం చేస్తోంది
  • ఉగ్రవాదుల దాడికి కచ్చితంగా సమాధానమిస్తాం
కేంద్ర ప్రభుత్వ పథకాలను తమ పథకాలుగా టీడీపీ చెప్పుకుంటోందని బీజేపీ మహిళా నేత పురందేశ్వరి విమర్శించారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలా సాయం చేస్తోందని మరోసారి స్పష్టం చేశారు. మోదీని ఎదుర్కోవడానికి అవినీతి పార్టీలన్నీ ఏకమవుతున్నాయని విమర్శించారు. దేశ భద్రత, పురోగతికి కేంద్రం కట్టుబడి ఉందని, వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా పుల్వామాలో ఉగ్ర వాద ఘటన గురించి ఆమె ప్రస్తావించారు. ఉగ్రవాదుల దాడికి కచ్చితంగా సమాధానమిస్తామని, మార్చి 1న విశాఖలో ప్రధాని మోదీ పర్యటించనున్నట్టు తెలిపారు.
india
pm
modi
bjp
purandeswari
Pakistan

More Telugu News