Telangana: సీఆర్పీఎఫ్ అమరులకు చిరుసాయం.. రూ.50 లక్షల చెక్కును అందించిన కేటీఆర్!

  • సీఆర్పీఎఫ్ ఐజీపీ రాజుకు చెక్కు అందజేత
  • వ్యక్తిగతంగా రూ.25 లక్షలు విరాళం
  • అమర జవాన్ల కోసం 2 నిమిషాల మౌనం
జమ్మూకశ్మీర్ లోని పుల్వామాలో గత గురువారం జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అమరులైన జవాన్లకు నివాళులు అర్పించారు.

అనంతరం అమర జవాన్ల కుటుంబాలకు రూ.25 లక్షల వ్యక్తిగత విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. తన స్నేహితులు మరో రూ.25 లక్షలను అందించారని కేటీఆర్ తెలిపారు. మొత్తం రూ.50 లక్షల విరాళాన్ని చెక్కు రూపంలో సీఆర్పీఫ్‌ సదరన్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో ఐజీపీ రాజుకు కేటీఆర్ అందించారు. ఈ సందర్భంగా అమరులైన జవాన్ల కోసం రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.
Telangana
TRS
KTR
crpf
jawans
dad
compensation
50 lakh check

More Telugu News