Rajanikant: 2019 సార్వత్రిక ఎన్నికలపై రజనీకాంత్ కీలక ప్రకటన!

  • 2021 అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్
  • లోక్ సభ ఎన్నికల్లో ఎవరికీ మద్దతివ్వబోను
  • నీటి సమస్య పరిష్కరించేవారికి ఓటేయండి
  • జిల్లా కార్యదర్శుల సమావేశంలో రజనీ
మరో మూడు నెలల్లో దేశవ్యాప్తంగా జరిగే లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయబోదని దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు చెన్నైలో జరిగిన జిల్లా కార్యదర్శుల సమావేశంలో రజనీ నిర్ణయించారు. 2021లో జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలే తన టార్గెట్ అని, లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు, మరో పార్టీకి మద్దతిచ్చేందుకు తాను వ్యతిరేకమని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో ఎవరికైనా తన మద్దతు ఉందంటూ ప్రచార చేసుకుంటే చట్ట పరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ప్రచారంలో తన చిత్రాన్ని వాడరాదని, రాష్ట్రంలో నీటి సమస్యను పరిష్కరిస్తారని భావించిన వారికి ప్రజలు ఓటు వేయాలని సూచించారు.
Rajanikant
Lok Sabha
Elections
Tamilnadu

More Telugu News