sexual desire: కోడలిపై కన్నేసి సొంత కొడుకునే కిరాతకంగా చంపిన తండ్రి.. శవాన్ని ముక్కలుగా కోసి డ్రైనేజీలో పారవేత!

  • పంజాబ్ లోని ఫరిద్ కోట్ లో ఘటన
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు
  • నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
కొడలిపై కన్నేసిన ఓ వ్యక్తి సొంత కొడుకునే కిరాతకంగా హతమార్చాడు. అనంతరం శవాన్ని ముక్కలు ముక్కలుగా కోసి డ్రైనేజీలో పడేశాడు. సభ్యసమాజం తలదించుకునే ఈ ఘటన పంజాబ్ లోని ఫరిదోకోట్ లో చోటుచేసుకుంది. ఫరిద్ కోట్ కు చెందిన ఛోటా సింగ్(62) కోడలు జస్వీర్ కౌర్ పై కన్నేశాడు. అడ్డుగా ఉన్న కుమారుడిని చంపేస్తే ఆమెను పెళ్లి చేసుకోవచ్చని భావించాడు.

ఈ నేపథ్యంలో కొడుకు రాజ్విందర్ సింగ్ నిద్రపోతుండగా పదునైన ఆయుధంతో హత్య చేశాడు. ఆ తర్వాత శవాన్ని ముక్కలు ముక్కలుగా కోసేసి డ్రైనేజీలో పడేశాడు. అయితే ఈ శబ్దానికి మేలుకున్న మేనల్లుడు గురుచాన్ సింగ్ గదంతా రక్తంతో నిండి ఉండటాన్ని చూశాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. రంగంలోకి దిగిన అధికారులు ఛోటా సింగ్ ను అదుపులోకి తీసుకున్నారు.

ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారి మాట్లాడుతూ.. రాజ్విందర్-జస్వీర్ కు 12 ఏళ్ల క్రితం వివాహం అయిందని తెలిపారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారన్నారు. నిందితుడిని అరెస్ట్ చేశామనీ, కోర్టు ముందు హాజరుపరుస్తామని పేర్కొన్నారు.
sexual desire
daughter in law
own son killed
by father
India
punjab
Police

More Telugu News