Goa: బురఖా ధరించి లేడీస్ టాయిలెట్ లోకి వెళ్లిన ప్రభుత్వ ఉద్యోగి!

షార్ట్స్‌లో చూడండి
ఓ ప్రభుత్వ ఉద్యోగి బురఖా ధరించి, లేడీస్ టాయిలెట్ లోకి వెళ్లడంతో మహిళలు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన గోవా సెంట్రల్ బస్టాండ్ లో శనివారం నాడు జరిగింది. ముస్లిం మహిళగా వేషం వేసుకున్న విర్గిల్ ఫెర్నాండెజ్ అనే 35 ఏళ్ల ఉద్యోగి ఆడవాళ్ల శౌచాలయంలోకి ప్రవేశించాడు. "ఓ ముస్లిం మహిళపై కన్నేసిన విర్గిల్ ఈ పని చేశాడు. పనాజి బస్టాండ్ లో ఈ ఘటన జరిగింది. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 419 కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నాం" అని పోలీసులు అధికారి ఒకరు మీడియాకు తెలిపారు.
Go Back to Shorts
Goa
Muslim
Burkha
Government Employee
Toilet

More Telugu News