pulwama: పుల్వామా దాడి ఎంత ఘోరమంటే.. అర కిలోమీటరు దూరం ఎగిరిపడిన జవాన్ల మృతదేహాలు

  • ఘటనా స్థలానికి అర కిలోమీటరు దూరం నుంచి మృతదేహాలు స్వాధీనం
  • వెల్లడించిన జమ్ముకశ్మీర్ పోలీసులు
  • భద్రతా లోపాలపై దర్యాప్తుకు ఆదేశం
జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి ఎంత భయంకరమైనదో పోలీసులు వెల్లడించారు. పేలుడు ధాటికి జవాన్ల మృతదేహాలు ఏకంగా అర కిలోమీటరు దూరం ఎగిరిపడ్డాయని జమ్ముకశ్మీర్ పోలీసులు వెల్లడించారు. ఘటనా స్థలానికి అరకిలోమీటరు దూరంలో ఉన్న ఇళ్లు, మొబైల్ టవర్ల వద్ద పడ్డ సైనికుల మృతదేహాల భాగాలను స్వాధీనం చేసుకున్నట్టు ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

డీఎన్ఏ పరీక్షల ద్వారా మృతదేహాలను గుర్తించినట్టు పేర్కొన్నారు. పేలుడు తీవ్రతను బట్టి 200 నుంచి 300 కిలోల పేలుడు పదార్థాలను ఉగ్రవాదులు ఉపయోగించి ఉంటారని అనుమానిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. భద్రతా లోపాలపై దర్యాప్తునకు ఆదేశించినట్టు పేర్కొన్నారు.
pulwama
Jammu And Kashmir
Terror Attack
CRPF Convoy

More Telugu News