Vilambi: 60 ఏళ్లకు ఓ మారు వచ్చే శుభదినం నేడు!

  • నేడు విళంబి నామ మాఘమాసం, పునర్వసు
  • శ్రీరాముని అర్చిస్తే సకల శుభాలు
  • సంస్కృత పండితులు గుదిమెళ్ల శ్రీమన్నారాయణాచార్యులు
శ్రీవిళంబి నామ సంవత్సరం మాఘ మాసం, పునర్వసు నక్షత్రం... 60 సంవత్సరాలకు వచ్చే ఈ శుభదినం నేడే. నేడు పునర్వసు నక్షత్రం మధ్యాహ్నం 2.23 గంటల వరకూ ఉంటుంది. ఈలోగా శ్రీరామకల్యాణం, అర్చన చేస్తే, సకల శుభాలూ సిద్ధిస్తాయని శ్రీ వైష్ణవ ఆగమ శాస్త్రం తెలుపుతోంది. ఇక ఇదే విషయాన్ని ఓ ప్రకటన ద్వారా వెల్లడించిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం సంస్కృత పండితులు గుదిమెళ్ల శ్రీమన్నారాయణాచార్యులు, మళ్లీ ఇటువంటి రోజు కోసం 60 సంవత్సరాలు వేచి చూడాల్సివుంటుందని అన్నారు. నేడు శ్రీరాముని దర్శిస్తే, సకల శుభాలు, సౌఖ్యాలు కలుగుతాయని తెలిపారు.
Vilambi
Punarvasu
Lord Sri Ram

More Telugu News