Andhra Pradesh: వైసీపీ ‘బీసీ గర్జన’కు తలసాని జనసమీకరణ చేస్తున్నారు: కేఈ కృష్ణమూర్తి ఆరోపణ

  • రేపు ఏలూరులో ‘బీసీ గర్జన’ బహిరంగ సభ
  • తలసాని రూట్ మ్యాప్ తయారు చేస్తున్నారు
  • బలహీన వర్గాల గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదు
వైసీపీ ఆధ్వర్యంలో రేపు ‘బీసీ గర్జన’ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి కేఈ కృష్ణమూర్తి స్పందించారు. టీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ సభకు జనసమీకరణ చేస్తున్నారని, రూట్ మ్యాప్ తయారు చేస్తున్నారని ఆరోపించారు. బలహీన వర్గాల గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదని అన్నారు.

తెలంగాణలో 26 బీసీ కులాలను తొలగిస్తే వారికి తమ పార్టీ అండగా ఉన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. టీడీపీ బీసీల పార్టీ అని, ఇటీవల తాము నిర్వహించిన ‘జయహో బీసీ’ సదస్సుకు వచ్చిన వారిలో పది శాతం మంది కూడా వైసీపీ ‘బీసీ గర్జన’కు రారని జోస్యం చెప్పారు. కాగా, ‘బీసీ గర్జన’ బహిరంగ సభ ఏర్పాట్లను వైసీపీ నేతలు పరిశీలించారు. ఈ సభలో బీసీ డిక్లరేషన్ ని ప్రకటించనున్నారు.  
Andhra Pradesh
YSRCP
Telugudesam
ke
TRS
talasani

More Telugu News