Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో చీరాల ఒక నియోజకవర్గం కాదా?: చంద్రబాబుకు ఆమంచి సూటి ప్రశ్న

  • దేశంలోని రాష్ట్రాల్లో ఏపీ కూడా ఒకటి కాదా? అని మోదీని ప్రశ్నిస్తారుగా!
  • చీరాలపై చూపిన వివక్షకు ఏం సమాధానం చెబుతారు? 
  • ప్రజాసేవలో తాను కాపలాదారుడినన్న ఆమంచి 

టీడీపీపై, ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడుపై వైసీపీ నాయకుడు ఆమంచి కృష్ణ మోహన్ విమర్శలు గుప్పించారు. నాడు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ నేడు లేదని వ్యాఖ్యానించారు. దేశంలోని 29 రాష్ట్రాల్లో ఏపీ ఒకటి కాదా? అంటూ మోదీని ప్రశ్నిస్తున్న చంద్రబాబును తాను సూటిగా ఓ ప్రశ్న వేస్తున్నానని, ఆంధ్రప్రదేశ్ లో చీరాల ఒక నియోజకవర్గం కాదా? అని ప్రశ్నించారు. తమ నియోజకవర్గంపై చూపిన వివక్షకు చంద్రబాబు ఏం సమాధానం చెబుతారని సూటిగా ప్రశ్నించారు.

ప్రజా సేవలో తాను కాపలాదారుడినని, ప్రజల కోసమే గతంలో తాను టీడీపీలో చేరానని, అదే ప్రజల కోసం ఇప్పుడు వైసీపీలో చేరానని ఆమంచి కృష్ణమోహన్ స్పష్టం చేశారు. తన ముఖ్య అనుచరులు, కార్యకర్తలతో కలిసి మాట్లాడిన తర్వాతే వైసీపీలో తాను చేరానని అన్నారు. మళ్లీ అధికారంలో ఉండి ప్రజలకు సేవ చేయాలన్న తపనతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని వ్యాఖ్యానించారు. తనతో కలిసి ప్రయాణం చేసే టీడీపీ, వైసీపీ..ఇలా అందరినీ కలుపుకుని ప్రయాణం సాగిస్తానని చెప్పారు.

  • Loading...

More Telugu News