crpf: జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించిన చంద్రబాబు

  • ఒక్కో అమర జవాను కుటుంబానికి రూ. 5 లక్షలు
  • అమరుల త్యాగాలను జాతి గుర్తుంచుకుంటుందన్న చంద్రబాబు
  • కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అండగా ఉంటామన్న సీఎం
పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు. ఒక్కో అమర జవాను కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని ఇవ్వనున్నట్టు తెలిపారు. అమరుల త్యాగాలను జాతి ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని చెప్పారు. జవాన్ల కుటుంబాలకు అందరూ అండగా నిలవాలని కోరారు. ఉగ్రవాదాన్ని అణచివేయడంలో కేంద్ర ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయానికైనా ఏపీ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటివి చోటు చేసుకోకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పక్కా వ్యూహాన్ని అనుసరించాలని అన్నారు. ఉగ్రదాడిలో ఇంత మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని చెప్పారు.
crpf
jawan
exgratia
Chandrababu

More Telugu News