kajal: 'సీత'లో విలన్ గా అదరగొట్టేస్తున్నాడట!
- 'ఆగడు' తరువాత తగ్గిన అవకాశాలు
- ఆర్థికపరమైన నష్టాలు
- ఆశలన్నీ 'సీత' సినిమాపైనే
తేజ దర్శకత్వంలో కాజల్ ప్రధాన పాత్రధారిగా 'సీత' సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో కాజల్ జోడీగా బెల్లంకొండ శ్రీనివాస్ కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాలో ప్రతినాయకుడిగా సోనూసూద్ అదరగొట్టేస్తున్నాడట. తేజ ఆయన పాత్రను చాలా పవర్ఫుల్ గా మలిచాడని చెబుతున్నారు. సోనూసూద్ విలనిజం చాలా కొత్తగా .. ఇంతవరకూ తాను చేసిన విలన్ పాత్రలకు భిన్నంగా ఉంటుందని అంటున్నారు.
హీరోతో సమానంగా నువ్వా .. నేనా అన్నట్టుగా సోనూసూద్ పాత్ర పూర్తిస్థాయిలో వుంటుందట. అందువలన ఈ సినిమా సక్సెస్ పై ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. 'ఆగడు' పరాజయం తరువాత సోనూసూద్ కి తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. ఆ తరువాత ఆయన కొన్ని సినిమాల నిర్మాణంలో భాగస్వామిగా మారి ఆర్థికంగా నష్టపోయాడు కూడా. అందువలన అవకాశాల పరంగా .. ఆర్థికంగా 'సీత' తనకి హెల్ప్ అవుతుందని ఆయన భావిస్తున్నాడు.