kangana ranaut: అలాంటి వారిని గాడిదపై ఊరేగించాలి: కంగనా రనౌత్

  • పుల్వామా ఘటనతో దేశమంతా రగిలిపోతోంది
  • జవాన్లను చంపడమంటే అందరి కడుపులో కత్తులు దింపడమే
  • శాంతి, అహింస గురించి మాట్లాడేవారిని గాడిదపై ఊరేగించాలి
పుల్వామా ఉగ్రదాడిపై సినీ నటి కంగనా రనౌత్ మండిపడింది. జరిగిన దారుణ ఘటనతో దేశమంతా రగిలిపోతోందని... ఇలాంటి సమయంలో శాంతి గురించి మాట్లాడేవారికి బుద్ధి చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేసింది. మన దేశ గౌరవంపై పాక్ దెబ్బకొట్టిందని, అవమానానికి గురి చేసిందని తెలిపింది. ఈ సమయంలో ఆ దేశంపై కఠినమైన చర్యలు తీసుకోవాలని... ఇప్పుడు మౌనం వహిస్తే మనల్ని పిరికివారి కింద జమకడతారని చెప్పింది. జవాన్లను చంపడమంటే మనందరి కడుపులో కత్తులు దింపినట్టేనని వ్యాఖ్యానించింది. ఈ సమయంలో శాంతి, అహింస అని మాట్లాడేవారిని గాడిదపై ఊరేగించాలని చెప్పింది.
kangana ranaut
bollywood
pulwama

More Telugu News