Andhra Pradesh: చిగురుపాటి జయరాం హత్య కేసు.. నిందితులకు మరో 8 రోజుల పోలీస్ కస్టడీ!

  • ఈరోజు కోర్టు ముందు హాజరుపర్చిన పోలీసులు
  • కేసు విచారణకు మరింత సమయం కావాలని విజ్ఞప్తి
  • హత్య కేసు విచారణలో జోరు పెంచిన తెలంగాణ పోలీసులు
ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో నిందితులు రాకేశ్ రెడ్డి, శ్రీనివాస్ ను పోలీసులు ఈరోజు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా పోలీసులు స్పందిస్తూ.. నిందితులను విచారించేందుకు మరింత సమయం కోవాలని కోర్టును కోరారు. మరో 8 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని విన్నవించారు. జయరాం కారు దొరికిన నందిగామకు వెళ్లి విచారించేందుకు, హత్య జరిగిన సీన్ ను రీ క్రియేట్ చేసేందుకు నిందితులను తమ కస్టడీకి అప్పగించాలన్నారు. వాదనలు విన్న నాంపల్లి కోర్టు రాకేశ్ రెడ్డి, శ్రీనివాస్ లను ఈ నెల 23 వరకూ పోలీసుల కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
Andhra Pradesh
Telangana
chigurupati
jayaram
nampally court
8 day custody

More Telugu News