Thamanna: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • గోపీచంద్ సరసన తమన్నా 
  • వచ్చే నెల నుంచి బన్నీ సినిమా 
  • మరో చిత్రానికి ఓకే చెప్పిన రామ్ 
*  గోపీచంద్, సంపత్ నంది కాంబినేషన్లో మరో చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ ఏప్రిల్ నుంచి జరుగుతుంది. ఇందులో తమన్నా కథానాయికగా నటించే ఛాన్స్ వుంది.
*  అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందే చిత్రం షూటింగ్ మార్చ్ నుంచి జరుగుతుంది. ఇందులో కథానాయికగా పూజా హెగ్డే దాదాపు ఖరారు అయినట్టు తెలుస్తోంది. బన్నీతో త్రివిక్రమ్ కు ఇది మూడవ చిత్రం అవుతుంది.
*  ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'ఇస్మార్ట్ శంకర్' చిత్రం చేస్తున్న హీరో రామ్ తాజాగా మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 'అప్పట్లో ఒకడుండేవాడు' ఫేం సాగర్ చంద్ర దర్శకత్వంలో నటించడానికి రామ్ ఓకే చెప్పాడట. 
Thamanna
Gopichand
Allu Arjun
Pooja Hegde

More Telugu News