prajashanthi party: ప్రజాశాంతి పార్టీ ఎన్నికల గుర్తు ‘హెలికాఫ్టర్’: కేఏ పాల్

  • ‘హెలికాఫ్టర్’ గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది
  • వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు, జగన్ గెలవలేరు
  • మంచి ప్రభుత్వం రాగానే పాకిస్థాన్ తో మాట్లాడతాం
ప్రజాశాంతి పార్టీ గుర్తును ఆ పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ వెల్లడించారు. తమ పార్టీ గుర్తు ‘హెలికాఫ్టర్’ అని ప్రకటించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రజాశాంతి పార్టీకి ‘హెలికాఫ్టర్’ గుర్తును ఎన్నికల సంఘం కేటాయించిందని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్ పై మరోమారు ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో లక్షల కోట్లు ఖర్చు చేసినా చంద్రబాబు, జగన్ గెలవలేరని వ్యాఖ్యానించారు.

తనతో కలిసి రావాలని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ని ఆహ్వానించినా ఆయన స్పందించలేదని అన్నారు. జమ్ముకశ్మీర్ లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు నివాళులర్పిస్తున్నట్టు చెప్పారు. కేంద్రంలో మంచి ప్రభుత్వం రాగానే  పాకిస్థాన్ తో మాట్లాడి శాంతిని నెలకొల్పుతానని పాల్ వ్యాఖ్యానించడం కొసమెరుపు.
prajashanthi party
ka pal
helicopter
Chandrababu
jagan
Pawan Kalyan
Jammu And Kashmir
srinagar

More Telugu News