Prakash Goud: జవాన్లపై దాడికి నిరసనగా హైదరాబాదులో కొవ్వొత్తుల ర్యాలీ

  •  ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆధ్వర్యంలో ర్యాలీ 
  • ఉగ్రవాదాన్ని తరిమికొట్టాలి
  • జవాన్లపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానన్న ఎమ్మెల్యే 
జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో భారత జవాన్లపై జరిగిన ఉగ్ర దాడికి నిరసనగా నేడు హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆధ్వర్యంలో రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని బాబుల్ రెడ్డి నగర్ నుంచి ఆరంఘర్ చౌరస్తా వరకూ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ... ప్రతి పౌరుడు భారత జవాన్లకు మద్దతుగా నిలవాలన్నారు. ప్రపంచ దేశాలన్నీ ఏకమై ఉగ్రవాదాన్ని తరిమికొట్టాలని అన్నారు. జవాన్లపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు ప్రకాష్ తెలిపారు.
Prakash Goud
Jammu Kashmir
Pulwama
Hyderabad
Candle Rally

More Telugu News