Lakshmi`s NTR: తన స్నేహితులతో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ నిర్మాత రాకేశ్ రెడ్డి ఫొటో ఇది.. వర్మ ఆసక్తికర పోస్ట్!

  • రాకేశ్ రెడ్డి విమానంలో ప్రయాణిస్తున్న ఫొటో పోస్ట్
  • ఫొటోలో వైసీపీ నేత మిథున్ రెడ్డి, అధినేత జగన్
  • ఈ ఫొటో ఏ సందర్భంలోదో ప్రస్తావించని వర్మ
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. ఈ చిత్ర నిర్మాత రాకేశ్ రెడ్డి. ఇదిలా ఉండగా, ఈ చిత్రానికి నిర్మాత రాకేశ్ రెడ్డి విమానంలో ప్రయాణిస్తుండగా దిగిన ఓ ఫొటోను వర్మ పోస్ట్ చేశారు. తన స్నేహితులతో కలిసి ఉన్న రాకేశ్ రెడ్డి అంటూ ఓ ఫొటోను పోస్ట్ చేశారు. మరో ట్వీట్ లో.. నవ్వులు చిందిస్తూ ఎడమ వైపున కూర్చుని ఉన్న వ్యక్తి రాకేశ్ రెడ్డి అని, మధ్యలో కూర్చుని ఉన్న వ్యక్తి అతని స్నేహితుడు అని చెప్పిన వర్మ, కుడివైపున ఉన్న వ్యక్తి ఎవరో తనకు తెలియదంటూ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే, మధ్యలో కూర్చున్న వ్యక్తి వైసీపీ నేత మిథున్ రెడ్డి కాగా, కుడి వైపున కూర్చుని వున్నది వైసీపీ అధినేత జగన్ కావడం గమనార్హం. కాగా, విమానంలో ఈ ముగ్గురు కలిసి ఏ సందర్భంలో ప్రయాణించారన్న విషయాన్ని వర్మ ప్రస్తావించలేదు.


Lakshmi`s NTR
ram gopal varma
Rakesh reddy
jagan
midhun reddy

More Telugu News