Mahesh Babu: 'మహర్షి'లో మనసును తాకే ఎమోషన్

  • వంశీ పైడిపల్లి నుంచి 'మహర్షి'
  • మహేశ్ బాబుకి 25వ సినిమా
  •  ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే కథాంశం     
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' సినిమా రూపొందుతోంది. ఓ మామూలు మనిషి .. 'మహర్షి' ఎలా అయ్యాడనే కథాంశంతో ఈ సినిమా నిర్మితమవుతోంది. మహేశ్ బాబుకి ఇది 25వ సినిమా కావడంతో, ఆయన అభిమానులంతా ఈ సినిమాపై ప్రత్యేక దృష్టి పెట్టారు. డిఫరెంట్ లుక్ తో మహేశ్ బాబు నుంచి వచ్చిన ఫస్టులుక్ ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెంచుతోంది.

ఈ సినిమాలో యాక్షన్ తోపాటు ఎమోషన్ పాళ్లు కూడా ఎక్కువగానే ఉంటాయనేది ఫిల్మ్ నగర్లో వినిపిస్తోన్న టాక్. స్నేహితుల మధ్య .. తల్లిదండ్రుల మధ్య చోటుచేసుకునే ఎమోషనల్ సీన్స్ మనసును బరువెక్కిస్తాయని అంటున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో దిల్ రాజు మాట్లాడుతూ .. 'ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ బరువెక్కిన హృదయంతో బయటికి వస్తారు' అని చెప్పడం, ఎమోషన్ పాళ్ల స్థాయిని సూచిస్తోంది. ఈ కారణంగా ఈ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ తాకిడి ఎక్కువగానే ఉండేట్టుగా అనిపిస్తోంది. 
Mahesh Babu
pooja hegde

More Telugu News