jagan: జగన్ యాత్రపై రాళ్లు వేయించిన వ్యక్తి ఇప్పుడు అదే పార్టీలో చేరారు: జూపూడి

  • ఓదార్పు యాత్రపై ఆమంచి రాళ్లు వేయించారు
  • ఆమంచి, అవంతిలకు డిపాజిట్లు కూడా రావు
  • వైసీపీలో ఒక సామాజికవర్గానికి చెందిన వారికే ప్రాధాన్యత
టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన ఆమంచి కృష్ణమోహన్, అవంతి శ్రీనివాస్ లకు రానున్న ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావని టీడీపీ నేత జూపూడి ప్రభాకర్ అన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఓదార్పు యాత్రపై ఆమంచి రాళ్లు వేయించారని చెప్పారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు వైసీపీలో చేరడం హాస్యాస్పదమని అన్నారు. ప్రకాశం జిల్లాలో దళిత ఎస్పీని ఆమంచి ట్రాన్స్ ఫర్ చేయించారని చెప్పారు. వైసీపీలో ఒకే సామాజికవర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. బడుగు, బలహీనవర్గాల పార్టీ టీడీపీ అని చెప్పారు. జగన్ కు రాజకీయాలు నేర్పడానికే ఆమంచి, అవంతిలు ఆ పార్టీలో చేరినట్టుందని అన్నారు.
jagan
amanchi
avanthi
jupudi prabhakar
Telugudesam
ysrcp

More Telugu News