KCR: ఇది కేసీఆర్ రిక్వెస్ట్... అందరూ పాటించాలి: కేటీఆర్

  • ఎల్లుండి కేసీఆర్ పుట్టిన రోజు 
  • వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయం
  • రక్తదానం చేయాలన్న కేటీఆర్
పుల్వామాలో ఆర్మీ కాన్వాయ్ పై జరిగిన ఉగ్రదాడిపై తన దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ, ఎల్లుండి తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకోరాదని నిర్ణయించుకున్న కేసీఆర్, ఇదే విషయాన్ని పార్టీ నేతలు, కార్యకర్తలకు వెల్లడించిన సంగతి తెలిసిందే. తన జన్మదిన వేడుకలకు దూరంగా ఉంటానని, ఎవరూ సంబరాలు చేసుకోవద్దని ఆయన ఆదేశించగా, ఆ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో తెలిపిన టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, "ఇది కేసీఆర్ గారి రిక్వెస్ట్.. అందరూ పాటించాలి" అని కోరారు. వేడుకల స్థానంలో కార్యకర్తలు రక్తదానం, అవయవ దానం, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా సమాజ హితానికి పాటు పడాలని సూచించారు.
KCR
KTR
Twitter
Birthday

More Telugu News