Chandrababu: నరేంద్ర మోదీని, కేసీఆర్ ను వదిలిపెట్టలేని పరిస్థితుల్లో జగన్: చంద్రబాబు ఎద్దేవా

  • ఎవరిని కాదన్నా జైలుకే
  • అభివృద్ధిని అడ్డుకోవడానికి కుట్రలు
  • టెలీ కాన్ఫరెన్స్ లో చంద్రబాబు
ప్రధాని నరేంద్ర మోదీనిగానీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను గానీ కాదనలేని పరిస్థితుల్లో వైఎస్ జగన్ ఉన్నారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఈ ఉదయం టీడీపీ నాయకులు, కార్యకర్తలతో టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన ఆయన, ఇద్దరిలో ఎవరిని వదిలినా జగన్ వెంటనే జైలుకు వెళ్లక తప్పదని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందరాదన్నదే జగన్, కేసీఆర్, మోదీల ఆలోచనని, వీరి కుట్రలను ప్రజా క్షేత్రంలో ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ ను మించిపోయేలా అమరావతిలో అభివృద్ధి జరిగితే, తమకు మనుగడ ఉండదన్నది వీరిలోని భయమని అన్నారు. అభివృద్ధి కోసం తాను కేంద్రంతో యుద్ధం చేస్తున్నానని, గెలుపే లక్ష్యంగా సాగుతున్న తనకు ప్రజలు సహకరించాలని కోరారు.
Chandrababu
KCR
Narendra Modi
Jagan

More Telugu News