KA Paul: నేడు పార్టీ గుర్తును ప్రకటించనున్న కేఏ పాల్!

  • హోటల్ ఐలాపురంలో ప్రెస్ మీట్
  • జర్నలిస్టులకు ఆహ్వానం పలుకుతూ ట్వీట్
  • కేవలం సీనియర్, బ్యూరో చీఫ్ లకే ఆహ్వానమన్న పాల్ 
ప్రజాశాంతి పేరిట పార్టీని పెట్టి, రానున్న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో బరిలోకి దిగాలని భావిస్తున్న క్రైస్తవ మతప్రచారకుడు కేఏ పాల్, తన పార్టీ గుర్తును నేడు ప్రకటించనున్నట్టు తెలిపారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. "ఇక వేచి చూడాల్సిన అవసరం లేదు. నేడు సాయంత్రం 5 గంటలకు విజయవాడలోని హోటల్ ఐలాపురంలో పార్టీ గుర్తును ప్రకటిస్తాం. మీడియాతోనూ మాట్లాడతా. కేవలం సీనియర్ జర్నలిస్టులు, బ్యూరో చీఫ్ లకు మాత్రమే ఆహ్వానం" అని తెలిపారు. మరిన్ని వివరాల కోసం 9550980590, 8639932347 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని కోరారు.



KA Paul
Prajasanthi
Media Meet
Party Symbol

More Telugu News