Miyapur: తన గర్ల్ ఫ్రెండ్ ను భర్త వేధించాడట... కాపుకాసి, లిఫ్ట్ అడిగి పొడిచాడు!

షార్ట్స్‌లో చూడండి
తన స్నేహితురాలిని వేధిస్తున్నాడన్న కోపంతో లిఫ్ట్ అడిగి దాడి చేసిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను మియాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, ఆల్విన్ కాలనీలో ఉండే శ్రీహర్ష, పశ్చిమ బెంగాల్ కు చెందిన సంగీతలకు గతంలో పరిచయం ఉండేది. ఆపై సంగీతకు బీరేందర్ తో వివాహం జరుగగా, వారిద్దరూ లాగార్డెనియా స్టూడియో అపార్ట్ మెంట్స్ లో నివాసం ఉంటున్నారు. శ్రీహర్ష ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు.

ఇదిలావుండగా, సంగీత, బీరేందర్ ల మధ్య తరచూ గొడవలు జరుగుతుండగా, బీరేందర్ భార్యను నిత్యమూ కొడుతూ వేధిస్తున్నాడట. భర్త తనను కొడుతున్నాడని శ్రీహర్ష వద్ద చెప్పుకుని వాపోతుండేది సంగీత. దీంతో బీరేందర్ ను హత్య చేయాలని ప్లాన్ వేసిన శ్రీహర్ష, మియాపూర్ ప్రాంతంలో అతను బైక్ పై వస్తుండటాన్ని చూసి, లిఫ్ట్ అడిగాడు. బీరేందర్ బైక్ ఆపి అతనిని ఎక్కించుకున్నాడు.

ఆపై, మార్గమధ్యంలో బీరేందర్ పై కత్తితో దాడి చేసి పారిపోయాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు శ్రీహర్షను అరెస్ట్ చేసి విచారించగా, నేరాన్ని అంగీకరించాడు. దీంతో అతనిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేశామని, విచారిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
Go Back to Shorts
Miyapur
Hyderabad
Police
Lift
Software Engineer
Girlfriend

More Telugu News