Actress Yashika: తమిళ సినీ, టెలివిజన్ నటి యషిక ఆత్మహత్య

  • ఆత్మహత్యకు ముందు తల్లికి వాట్సాప్ మెసేజ్
  • నాలుగు నెలలుగా వ్యాపారవేత్తతో సహజీవనం
  • మూడు రోజుల క్రితం ఇద్దరి మధ్య గొడవ
తమిళ సినీ , టీవీ నటి యషిక ఆత్మహత్యకు పాల్పడింది. చెన్నైలోని వడపళనిలో ఉన్న తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అంతకుముందు తన ఆత్మహత్యకు ప్రియుడే కారణమని, అతడిని వదలొద్దంటూ తల్లికి వాట్సాప్‌లో మెసేజ్ చేసింది.

తిరుప్పూరుకు చెందిన యషిక అసలు పేరు మేరీ షీలా జబరాని. గతంలో వడపళనిలోని ఓ హాస్టల్‌లో ఉండే యషిక పెరంబూరుకు చెందిన అరవింద్ అలియాస్ మోహన్‌బాబు అనే వ్యాపారవేత్తతో ప్రేమలో పడింది. ఇద్దరూ కలిసి గత నాలుగు నెలలుగా సహజీవనం చేస్తున్నారు. మూడు రోజలు క్రితం ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తినట్టు తెలుస్తోంది. దీంతో మనస్తాపం చెందిన యషిక ఆత్మహత్యకు పాల్పడినట్టు సమాచారం.  

సమాచారం అందుకున్న పోలీసులు యషిక ఇంటికి చేరుకుని ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. నివేదిక అందిన అనంతరం తదుపరి చర్యలు తీసుకోనున్నట్టు పోలీసులు తెలిపారు. పలు సీరియళ్లలో నటించిన యషిక.. విమల్ హీరోగా నటించిన ‘మన్నార్ వగెరా’ సినిమాలో నటించింది. యషిక మృతిపై తమిళ చిత్రపరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
Actress Yashika
suicide
Mannar Vagera
Vadapalani
kollywood

More Telugu News