Valentines Day: రాజమహేంద్రవరంలో జెన్ పాక్ట్ క్యాంపస్ ఇంటర్వ్యూ... లవర్ గురించి మాట్లాడి ఉద్యోగం కొట్టేసిన అమ్మాయి!

  • మీరు ఉద్యోగం ఇస్తే లవర్ కు పార్టీ ఇస్తా
  • ఇవ్వకుంటే పార్టీ తీసుకుంటా
  • చప్పట్లు కొట్టి ఉద్యోగాన్ని ఆఫర్ చేసిన జెన్ పాక్ట్
వాలెంటైన్స్ డేకు సంబంధించిన ఓ ప్రశ్న అమ్మాయి జీవితాన్ని మార్చేసింది. రాజమహేంద్రవరంలోని ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజీలో జెన్ పాక్ట్ సంస్థ సుమారు 80 మందికి క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించింది. నిన్న ప్రేమికుల రోజు కాగా, బాయ్ ఫ్రెండ్ గురించి, లవర్ గురించి ఏదో ఓ సందర్భంగా ఇంటర్వ్యూలో అభ్యర్థులను ప్రశ్నించారు. ప్రేమికుల రోజును ఎలా జరుపుకుంటారని అడిగారు. చాలా మంది సమాధానం ఇవ్వలేక ఆగిపోవడం, మరికొందరు తమకు తోచిందేదో చెప్పడం చేశారు. కానీ, ఓ యువతి మాత్రం ధైర్యంగా సమాధానం చెప్పింది. "మీరు ఉద్యోగం ఇస్తే నా బాయ్‌ ఫ్రెండ్‌ కు పార్టీ ఇస్తాను. ఉద్యోగం ఇవ్వకుంటే ఎప్పటిలాగే బాయ్‌ ఫ్రెండ్‌ వద్ద పార్టీ తీసుకుంటాను" అన్న ఆమె సమాధానానికి, ఆలోచనా విధానానికి జెన్ పాక్ట్ ప్రతినిధులు చప్పట్లు కొట్టి, ఉద్యోగాన్ని కన్ఫార్మ్ చేశారు. అదీ సంగతి!
Valentines Day
Lover
Party
Genpact
Job
Campus Interview

More Telugu News