Jammu And Kashmir: ఉగ్రవాదుల దురాగతానికి ఓ సైనికుడిగా నా రక్తం మరిగిపోతోంది: కేంద్ర మంత్రి వీకే సింగ్

  • ఉగ్రవాదులు ప్రతిఫలాన్ని అనుభవిస్తారు
  • జవాన్ల త్యాగాలకు ‘సెల్యూట్’ చేస్తున్నా
  • ఇది ఉగ్రవాదుల పిరికి చర్య
జమ్ము కశ్మీర్ లో ఉగ్రవాదుల ఘటనపై కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి వీకే సింగ్ ఉద్వేగ భరిత వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదుల దాడి ఘటనలో సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులు కావడంపై ఆయన సంతాపం వ్యక్తం చేశారు.ఈ ఘటనను ఉగ్రవాదుల పిరికి చర్యలా అభివర్ణించారు. ఈ సంద్భంగా వీకే సింగ్ మాట్లాడుతూ, ఓ పౌరుడిగా, సైనికుడిగా ఉగ్రవాదుల దురాగతాన్ని తలచుకుంటుంటే తన రక్తం మరిగిపోతోందని, ప్రతి రక్తపు బొట్టుకు ఉగ్రవాదులు ప్రతిఫలాన్ని అనుభవిస్తారని హెచ్చరించారు. జవాన్ల త్యాగాలకు ‘సెల్యూట్’ చేస్తున్నానని వీకే సింగ్ అన్నారు.


Jammu And Kashmir
central minister
vk singh
crpf

More Telugu News