Srinagar: పుల్వామా దాడిలో 42కు పెరిగిన మృతుల సంఖ్య

  • దాడికి పాల్పడిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ
  • 15 ఏళ్ల తరువాత ఇదే అతిపెద్ద దాడి
  • వాహనాల్లో మొత్తం 2500 మంది
శ్రీనగర్‌లోని పుల్వామా జిల్లా అవంతిపురాలో 70 వాహనాలతో వెళుతున్న సీఆర్ఫీఎఫ్ కాన్వాయ్‌పై జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ఆత్మాహుతి దాడికి పాల్పడింది. ఈ ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల సంఖ్య 42కు చేరుకుందని సమాచారం. 15 ఏళ్ల తరువాత ఇదే అతి పెద్ద దాడి అని ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి. వాహనాల్లో మొత్తం 2500 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ఉన్నట్టు సమాచారం. 350 కిలోల పేలుడు పదార్థాలతో కూడిన ట్రక్కుతో కాన్వాయ్‌లోని వాహనాన్ని ఉగ్రవాదులు ఢీ కొట్టారు. దీంతో భారీ పేలుడు సంభవించినట్టు ప్రత్యక్ష సాక్షుల కథనం.
Srinagar
CRPF
Jaishe Mohammad
Vehicles
Army

More Telugu News