YSRCP: అవినీతికి పేటెంట్ గా ఉన్న జగన్ తో కలిసి నీతులు చెబుతారా?: అవంతిపై అనిత ఫైర్

  • గతంలో జగన్ ని దారుణంగా అవంతి తిట్టారు
  • ఇప్పుడు వైసీపీలో ఎలా చేరారు?
  • ఎంతో గౌరవించిన పార్టీకి నమ్మకద్రోహం చేశారు
టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ ఆ పార్టీని వీడి వైసీపీలో చేరడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అవంతిపై టీడీపీ నాయకురాలు వంగలపూడి అనిత మండిపడ్డారు. అవినీతికి పేటెంట్ గా ఉన్న జగన్ తో కలిసి నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. గతంలో జగన్ ని దారుణంగా తిట్టిన అవంతి, ఇప్పుడు వైసీపీలో ఎలా చేరారని ప్రశ్నించారు.

కాపులకు రిజర్వేషన్లు ఇచ్చిన చంద్రబాబుకు క్షీరాభిషేకం చేసింది మరిచారా? చంద్రబాబును ‘కాపుమిత్ర’గా కీర్తించలేదా? అని అవంతిపై ఆమె ప్రశ్నల వర్షం కురిపించారు. ఎంతో గౌరవం ఇచ్చిన పార్టీకి నమ్మకద్రోహం చేశారని, జగన్ పంచన చేరిన ఆయన కూరలో కరివేపాకులా మారనున్నారని, అవినీతి పార్టీలో చేరిన అవంతిని ప్రజలు తిరస్కరించడం ఖాయమని అన్నారు.
YSRCP
jagan
Telugudesam
Anitha
avanthi

More Telugu News