Raviteja: మార్చి 4 నుంచి ‘డిస్కోరాజా’ రెగ్యులర్ షూటింగ్!

  • ‘రాజా ది గ్రేట్’తో హిట్ కొట్టిన రవితేజ
  • రవితేజ సరసన ముగ్గురు ముద్దుగుమ్మలు
  • పిరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో ‘డిస్కోరాజా’
చాలా కాలం తర్వాత ‘రాజా ది గ్రేట్’ చిత్రంతో హిట్ కొట్టిన రవితేజ, ఆ తరువాత నటించిన ‘టచ్ చేసి చూడు, నేల టిక్కెట్టు, అమర్ అక్బర్ ఆంటోని’ సినిమాలు నిరాశను మిగిల్చాయి. ప్రస్తుతం ‘డిస్కోరాజా’ అనే చిత్రంలో నటించబోతున్నాడు. ఈ చిత్రంలో రవితేజ సరసన పాయల్ రాజ్‌పుత్, ప్రియాంక జువాల్కర్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి రానుంది. మార్చి 4 నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. పిరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం రూపొందనుందని తెలుస్తోంది. సినిమా ఆరంభంలో రవితేజ వృద్ధుడిగానూ.. అనంతరం శత్రువులపై పగ తీర్చుకోవడం కోసం సైంటిఫిక్ ప్రయోగాలతో యువకుడిగానూ మారుతాడని సమాచారం.  
Raviteja
Disco Raja
VI Anand
Payal Rajputh
Priyanka Juvalkar
Nabha Natash

More Telugu News