janasena: ‘జనసేన’ అధికారంలోకొస్తే పెనుగొండ ఊరు పేరు మారుస్తాం: పవన్ కల్యాణ్

  •  పెనుగొండలో శ్రీ వాసవి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ
  • ఈ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కల్యాణ్
  • ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 90 అడుగుల విగ్రహం
జనసేన పార్టీ అధికారంలోకొచ్చాక పెనుగొండ ఊరు పేరుని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి పెనుగొండ’గా మారుస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన, కుంభాభిషేకం మహోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన, పంచలోహాలతో తయారు చేసిన 90 అడుగుల అమ్మవారి విగ్రహానికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం, పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, ధర్మం దారి తప్పినప్పుడు ప్రాణం కంటే మానం గొప్పదని భావించి ఆత్మార్పణం చేసుకున్న పవిత్రమూర్తి కన్యకాపరమేశ్వరి అమ్మవారని, ఆమె జన్మించిన ఊరుగానే కాదు, ఆత్మార్పణ చేసుకున్న పవిత్ర స్థలంగానూ పెనుగొండకు విశిష్ట స్థానం ఉందని అన్నారు. ఆ చల్లని తల్లి శుభాశీస్సులు రాష్ట్రంలోని అందరి ఆడపడుచులపై ఉండాలని ఆకాంక్షించారు. అంతకుముందు, పెనుగొండ వాసవీ మాత దర్శనానికి వెళ్లిన పవన్ కు ఆలయ మర్యాదల ప్రకారం వేద పండితుల మంత్రోచ్చారణ, మంగళ వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. శ్రీ వాసవీ మాత భారీ విగ్రహాన్ని దర్శించుకున్న పనవ్, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
janasena
Pawan Kalyan
west godavari
penugonda

More Telugu News