Andhra Pradesh: పార్టీని వీడే నాయకులను చూసి భయపడే ప్రసక్తే లేదు: సీఎం చంద్రబాబు

  • ఆమంచి, అవంతి టీడీపీని వీడటంపై బాబు స్పందన
  • ఐదేళ్ల పాటు టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేలుగా ఉన్నారు
  • నాతో అన్ని పనులు చేయించుకున్నారు
చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ లు టీడీపీని వీడటంపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు స్పందించారు. పార్టీని వీడే నాయకులను చూసి తాను భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఐదేళ్ల పాటు టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్లు తనతో అన్ని పనులు చేయించుకున్నారని, ఇప్పుడు పార్టీ మారారని దుయ్యబట్టారు. ఇలాంటి వ్యక్తుల గురించి ప్రజలు ఆలోచించాలని సూచించారు. రాష్ట్రాన్ని తాము అభివృద్ధి చేస్తుండటంతో ఓర్వలేక పోతున్నారని, అందుకే, తమ ప్రజా ప్రతినిధులను లాక్కుంటూ కుట్రలకు పాల్పడుతున్నారని వైసీపీని విమర్శించారు.
Andhra Pradesh
Telugudesam
Chandrababu
YSRCP
jagan
chirala
mla
aamanchi
mp
avanthi

More Telugu News