ysrcp: ఆ వార్తల్లో వాస్తవం లేదు.. వైసీపీలో చేరడం లేదు: అమలాపురం టీడీపీ ఎంపీ రవీంద్రబాబు

ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో టీడీపీ నుంచి వైసీపీలోకి చేరికలు ఊపందుకుంటున్నాయి. ఇప్పటికే చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ లు టీడీపీకి రాజీనామా చేశారు. ఈ తరుణంలో అమలాపురం టీడీపీ ఎంపీ పి.రవీంద్రబాబు కూడా వైసీపీలో చేరబోతున్నారనే వార్తలు కలకలం రేపుతున్నాయి. ఈ వార్తలపై రవీంద్రబాబు స్పందించారు. ఆ వార్తల్లో వాస్తవం లేదని ఆయన చెప్పారు. తాను టీడీపీని వీడే ప్రసక్తే లేదని అన్నారు. చంద్రబాబుపై తనకు పూర్తి విశ్వాసం ఉందని... ఆయన ఎలా చెబితే అలా నడుచుకుంటానని తెలిపారు.
ysrcp
Telugudesam
p ravindra babu
Chandrababu
amalapuram
mp

More Telugu News