YSRCP: ‘కాగ్’ నివేదికను తప్పుదోవ పట్టించడంలో విజయసాయిరెడ్డి పాత్ర ఉంది: టీడీపీ ఎంపీ కనకమేడల

  • తిమ్మిని బమ్మిని చేయడంలో విజయసాయి దిట్ట
  • జగన్ లక్ష కోట్ల అవినీతిని తగ్గించడంలో ఆయన పాత్ర
  • ప్రధాని ఎడిట్ చేసిన దానినే ‘కాగ్’ నివేదికగా విడుదల
రాఫెల్ కుంభకోణానికి సంబంధించిన అనేక అంశాలను ‘కాగ్’ నివేదిక తప్పుదోవ పట్టించిందని, ఇందులో వైసీపీ ఎంపీ, ఆడిటర్ విజయసాయిరెడ్ది పాత్ర ఉందన్న ప్రచారం ఢిల్లీ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోందని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఆరోపించారు.

 ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తిమ్మిని బమ్మిని చేయడంలో విజయసాయిరెడ్డి సిద్ధహస్తుడని, జగన్ లక్ష కోట్ల అవినీతిని రూ.43 వేల కోట్లకు తగ్గించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని విమర్శించారు. రాఫెల్ కుంభకోణంలో ఎన్నో లోపాలు ఉన్నా కేంద్రాన్ని వైసీపీ వెనకేసుకొస్తోందని అన్నారు. ప్రధాన మంత్రి ఎడిట్ చేసిన దానినే ‘కాగ్’ నివేదికగా విడుదల చేశారని, అందులో, అనేక లొసుగులున్నాయని విమర్శించారు. ఈ భారీ కుంభకోణానికి సంబంధించిన అసలు విషయాలను బయటకు రాకుండా తొక్కిపెట్టారని ఆరోపించారు. 
YSRCP
vijayasai reddy
Telugudesam
mp
kanaka medal

More Telugu News