మోదీని ములాయం సింగ్ ఎందుకు పొగిడారంటే...: అమర్ సింగ్
- ఎస్పీ, బీఎస్పీలపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి
- వాటిని కప్పిపుచ్చుకునేందుకే మోదీని ములాయం పొగిడారు
- ములాయం, మాయావతి అండదండలతో ఇద్దరు ఐఏఎస్ లు నోయిడాను దోచుకున్నారు
పలు కుంభకోణాల కేసుల్లో ఐఏఎస్ అధికారులు చంద్రకళ, రామరామన్ లు ఇరుక్కున్నారని... వారిని కాపాడేందుకు ములాయం యత్నిస్తున్నారని అమర్ సింగ్ చెప్పారు. ములాయం, మాయావతి అండదండలతో ఈ ఇద్దరు ఐఏఎస్ లు నోయిడాను దోచుకున్నారని ఆరోపించారు. వారిపై దర్యాప్తు జరగకుండా మోదీని నిలువరించేందుకే ములాయం ఆయనను పొగిడారని చెప్పారు.