tulluru: తుళ్లూరులో బసవతారకం కేన్సర్‌ ఆసుపత్రి...నిర్మాణానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే బాలకృష్ణ

  • ఇండో అమెరికన్‌ ఆసుపత్రి, పరిశోధక కేంద్రం ఏర్పాటు
  • ముఖ్య అతిథిగా హాజరైన సీఎం చంద్రబాబు
  • 15 ఎకరాల స్థలం కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం
నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలోని తుళ్లూరు గ్రామంలో బసవతారకం కేన్సర్‌ ఆసుపత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన దాదాపు 15 ఎకరాల స్థలంలో నిర్మించనున్న ‘ఇండో అమెరికన్‌ కేన్సర్‌ ఆసుపత్రి, పరిశోధక కేంద్రం’కు సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ దంపతులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి శంకుస్థాపన చేశారు. కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దంపతులు కూడా హాజరయ్యారు.

నవ్యాంధ్రలోని రోగులకు స్థానికంగానే సేవలు అందించాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఆసుపత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌, ప్రముఖ వైద్యుడు దత్తాత్రేయ నోరి, మంత్రులు నారా లోకేష్‌, ప్రత్తిపాటి, నక్కా ఆనందబాబు, ఫరూక్‌, ఎంపీ కొనకళ్ల నారాయణ తదితరులు పాల్గొన్నారు.
tulluru
basavatarakam cancer hospital
foundationa stone
Balakrishna
Chandrababu

More Telugu News