Lakshmis NTR: పేపర్లలో ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చాము: రామ్ గోపాల్ వర్మ

  • నేడు లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రయిలర్ విడుదల
  • ఉదయం 9.27కు విడుదల కానున్న ట్రయిలర్
  • ట్విట్టర్ లో వెల్లడించిన రామ్ గోపాల్ వర్మ

ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ప్రవేశించిన తరువాత జరిగిన పరిణామాలతో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రాన్ని నిర్మించి, దాని ట్రయిలర్ ను నేడు విడుదల చేస్తానని చెప్పిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, నేడు పలు దినపత్రికల్లో ఇదే విషయాన్ని చెబుతూ ఫుల్ పేజీ యాడ్స్ ఇచ్చారు. ఈ విషయాన్ని తన అభిమానులకు ట్విట్టర్ ద్వారా వెల్లడించిన ఆయన, నేడు 9.27 గంటలకు ట్రయిలర్ ను విడుదల చేస్తానని చెప్పారు. ఈ చిత్రానికి రాకేష్ రెడ్డి, బాలగిరి దీప్తిలు నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా, కల్యాణ్ మాలిక్ సంగీతాన్ని అందించారు. 

Full page ad in Andhra Jyothi for #LakshmisNTR pic.twitter.com/XxZeMIj1kK

— Ram Gopal Varma (@RGVzoomin) February 14, 2019


  • Loading...

More Telugu News