Visakhapatnam District: విశాఖ నుంచి బరిలోకి దిగనున్న పవన్ కల్యాణ్?

  • ఉత్తరాంధ్ర నుంచి బరిలోకి పవన్
  • జనసేన సభ్యత్వాల్లో గాజువాక నియోజకవర్గం టాప్ 
  • అక్కడి నుంచే పోటీ చేయాలనే యోచనలో పవన్?
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేనాని పవన్ కల్యాణ్ విశాఖపట్టణం నుంచి బరిలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. తనకు టికెట్ కేటాయించాల్సిందిగా రెండు రోజుల క్రితం పార్టీ స్క్రీనింగ్ కమిటీకి దరఖాస్తు చేసుకున్న పవన్, విశాఖలోని గాజువాక నుంచి కానీ, లేదంటే తూర్పు గోదావరి జిల్లా నుంచి కానీ ఎన్నికల బరిలోకి దిగనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. స్క్రీనింగ్ కమిటీ కూడా గాజువాక వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. లక్ష జనసేన సభ్యత్వాలతో రాష్ట్రంలోనే గాజువాక నియోజకవర్గం అగ్రస్థానంలో ఉండడమే ఇందుకు ఒక కారణంగా తెలుస్తోంది. అయితే, ఈ విషయంలో మరో వారం రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని సమాచారం.
Visakhapatnam District
Gajuwaka
Jana Sena
Pawan Kalyan

More Telugu News