Madhulika: జ్వరంతో బాధపడుతున్న మధులిక.. ఆరోగ్యం ఇంకా విషమమే!

  • ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన బాలిక
  • నాలుగు శస్త్రచికిత్సలు చేసిన వైద్యులు
  • ప్రస్తుతం ఐసీయూలో
ప్రేమోన్మాది దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలిక మధులిక పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్టు యశోద ఆసుపత్రి వైద్యులు తెలిపారు. బాలిక ఆరోగ్యం కుదుటపడుతున్నట్టు రెండు రోజుల క్రితం ప్రకటించిన వైద్యులు.. తాజాగా ఆమె జ్వరంతో బాధపడుతున్నట్టు తెలిపారు. నాలుగు శస్త్రచికిత్సల అనంతరం ఆమెకు ఇన్ఫెక్షన్లు వ్యాపించినట్టు పేర్కొన్నారు. వాటి నివారణ కోసం యాంటీబయోటిక్ మందులను అందిస్తున్నట్టు వివరించారు. ప్రస్తుతం ఆమెకు ఐసీయూలోనే చికిత్స అందిస్తున్నట్టు యశోదా ఆసుపత్రి విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు.
Madhulika
Love
Hyderabad
Yasoda hospital
Telangana

More Telugu News