modi: మోసం చేసిన ఫలితాన్ని మోదీ త్వరలో రుచి చూడబోతున్నారు: టీడీపీ ఎంపీ జేసీ

  • మేమేమీ గొంతెమ్మ కోరికలు కోరలేదు
  • ఏపీకి ఇచ్చిన హామీలు అమలు చేయాలి
  • కేంద్రం చేసిన అన్యాయంపై టీడీపీ ఎంపీల నిరసన
విభజన చట్టంలోని హామీలను అమలు చేయకుండా, ఏపీకి ఇచ్చిన మాటను తప్పి, మోసం చేసిన ఫలితాన్ని మోదీ త్వరలో రుచి చూడబోతున్నారని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ఏపీకి కేంద్రం చేసిన అన్యాయాన్ని నిరసిస్తూ ఏపీ టీడీపీ ఎంపీలు పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో జేసీ మాట్లాడుతూ, తామేమీ గొంతెమ్మ కోరికలు కోరలేదని, ఏపీకి ఇచ్చిన హామీలను అమలు చేయమని మాత్రమే మోదీని కోరుతున్నామని అన్నారు.

టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ మాట్లాడుతూ, మొన్న గుంటూరు వచ్చిన మోదీ మళ్లీ మట్టి-నీళ్లు గురించే మాట్లాడేరే తప్ప, నిధుల గురించి మాట్లాడలేదని విమర్శించారు. నిధుల గురించి మాట్లాడకుండా, విధులు నిర్వర్తించకుండా, బాధ్యతారహితంగా, నిరంకుశంగా మోదీ వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో మోదీ ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు. చంద్రబాబు నాయకత్వంలో బీజేపీ యేతర పార్టీలను ఏకం చేసి కేంద్రంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.
modi
pm
Andhra Pradesh
Telugudesam
mp
jc

More Telugu News