Narendra Modi: మోదీ సర్కార్ ని తరిమికొట్టే సమయం ఆసన్నమైంది: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

  • ఢిల్లీలో అవినీతిని తరిమికొట్టాం
  • ఢిల్లీ, బెంగాల్ లో ప్రభుత్వాలను మోదీ ఇబ్బంది పెట్టారు
  • మమతా బెనర్జీని అభినందించిన కేజ్రీవాల్
ప్రధాని మోదీపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నిప్పులు చెరిగారు. ఢిల్లీలో ఆయన చేపట్టిన ధర్నాకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, పలు పార్టీల నేతలు మద్దతు తెలిపారు. అనంతరం, ఏర్పాటు చేసిన సభలో కేజ్రీవాల్ మాట్లాడుతూ, మోదీ సర్కార్ ని తరిమికొట్టే సమయం ఆసన్నమైందని అన్నారు. ఢిల్లీలో తాము అధికారంలోకి వచ్చిన కొద్దికాలంలోనే అవినీతి, అక్రమాలను తరిమికొట్టామని చెప్పారు. ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ లో ప్రభుత్వాలను మోదీ అనేక ఇబ్బందులకు గురిచేశారని మండిపడ్డారు. కోల్ కతాలో సీబీఐ అధికారులను ఇటీవల అడ్డుకున్న ఘటనపై మమతా బెనర్జీని అభినందించారు.
Narendra Modi
bjp
aap
Arvind Kejriwal

More Telugu News