tg venkatesh: బీజేపీలోని మోదీ వ్యతిరేకులు కూడా చంద్రబాబుకు మద్దతు పలుకుతున్నారు: టీజీ వెంకటేష్

  • ఓ నియంత నడిపినట్టు పార్లమెంటు సమావేశాలు జరిగాయి
  • మోదీ నియంతృత్వం కొనసాగదు
  • చంద్రబాబు పోరాటానికి అందరి మద్దతు లభిస్తోంది
ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అనే రీతిలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరిగాయని టీడీపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ అన్నారు. సమావేశాలను ఒక నియంత నడిపినట్టు ఉందని చెప్పారు. తాము చేసిందే కరెక్ట్ అనే విధంగా ప్రధాని మోదీ ప్రవర్తిస్తున్నారని అన్నారు.

 ఇందిరాగాంధీ వంటి గొప్ప నాయకురాలికే ఓటమి తప్పలేదని...  మోదీ నియంతృత్వం కూడా కొనసాగదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంపై తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని అన్నారు. చంద్రబాబు పోరాటానికి అన్ని పక్షాల నుంచి మద్దతు లభిస్తోందని చెప్పారు. బీజేపీలో మోదీని వ్యతిరేకిస్తున్నవారు కూడా చంద్రబాబుకు మద్దతు పలుకుతున్నారని అన్నారు. ఏపీకి కేంద్రం ఏమీ ఇవ్వకపోయినా... రాష్ట్ర సంపదను పెంచుతూ ఇతర రాష్ట్రాలకు కూడా చంద్రబాబు మార్గదర్శకులయ్యారని టీజీ కొనియాడారు.
tg venkatesh
modi
Chandrababu
parliament
bjp
Telugudesam

More Telugu News