giribabu: త్రివిక్రమ్ ను ప్రశంసించిన సీనియర్ నటుడు గిరిబాబు

  • త్రివిక్రమ్ గొప్ప రచయిత 
  • ఆయన ప్రతిభ కలిగిన దర్శకుడు
  •  నాకు 'సంధ్యారాగం' అంటే ఇష్టం  
విలన్ గాను .. కామెడీ రోల్స్ లోను .. సీరియస్ రోల్స్ లోను గిరిబాబు ప్రేక్షకులను మెప్పించారు. విభిన్నమైన పాత్రలను పోషిస్తూ సుదీర్ఘమైన కెరియర్ ను కొనసాగిస్తూ వచ్చారు. ఇప్పటికీ ఆయన ముఖ్యమైన పాత్రల్లో మెరుస్తూనే వున్నారు. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. "త్రివిక్రమ్ అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం వుంది. రచయితగా .. దర్శకుడిగా ఆయన పనిచేసిన చిత్రాలన్నింటిలోను నేను నటించాను.

ఆయన ఎంతటి గొప్ప రచయితో .. అంతటి గొప్ప దర్శకుడు కూడా. అంతటి సమర్ధుడైన దర్శకుడితో కలిసి పనిచేసినందుకు నాకు చాలా ఆనందంగా వుంది. ఒక రచయితగా .. దర్శకుడిగా నాకు అనుభవం వుంది కనుక, ఆ రెండు పాత్రలను సమర్థవంతంగా నిర్వహించడం ఎంత కష్టమనే విషయం నాకు తెలుసు. నా కెరియర్లో నేను రచయితగా చేసిన సినిమాల్లో నాకు 'సంధ్యారాగం' సినిమా ఇష్టం" అని ఆయన చెప్పుకొచ్చారు.
giribabu
trivikram

More Telugu News