Sunkara Padmashri: సుంకర పద్మశ్రీకి కీలక బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ అధిష్ఠానం!

  • ఏపీ పీసీసీ ఉపాధ్యక్షురాలిగా నియామకం
  • ఉత్తర్వులు జారీ చేసిన కాంగ్రెస్
  • కాంగ్రెస్‌ మహిళా విభాగం అధ్యక్షురాలిగా పనిచేసిన పద్మశ్రీ
కొన్ని రోజుల క్రితం వరకూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలిగా వ్యవహరించిన సుంకర పద్మశ్రీకి కాంగ్రెస్ అధిష్ఠానం కీలక పదవిని ఇచ్చింది. ఏపీ పీసీసీ ఉపాధ్యక్షురాలిగా ఆమెను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ నుంచి పీసీసీ కార్యాలయానికి ఆదేశాలు అందాయి. కాంగ్రెస్‌ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా ఇటీవల సుంకర పద్మశ్రీ స్థానంలో రమణి కుమారిని నియమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పద్మశ్రీకి పీసీసీలో స్థానం కల్పించినట్టు తెలుస్తోంది. గన్నవరం ప్రాంతానికి చెందిన పద్మశ్రీ పలు నిరసనల్లో ముందు నిలవడంతో పాటు తనదైన శైలిలో అధికార పార్టీపై విమర్శలు గుప్పించడం ద్వారా అధిష్ఠానానికి చేరువయ్యారు.
Sunkara Padmashri
APPCC
Vice President

More Telugu News