సరైన పత్రాలతో మళ్లీ రావచ్చంటూ... 8 మంది తెలుగు విద్యార్థులకు అమెరికా విముక్తి!
- నకిలీ వర్శిటీ ఉచ్చులో ఎంతో మంది విద్యార్థులు
- స్వచ్ఛందంగా దేశం విడిచి వెళతామని వినతి
- అంగీకరించిన న్యాయస్థానం
అంతకుముందు ఈ కేసులో న్యాయమూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తాను ఈ నిర్ణయం తీసుకున్నానని, మరోసారి అమెరికా రావాలని భావిస్తే, సరైన వీసా పత్రాలతో దర్జాగా రావచ్చని ఆయన తెలిపారు. కాగా, తమను జైలు నుంచి విడిపించేందుకు సహకరించిన తెలుగు సంఘాల ప్రతినిధులకు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కేసులో అరెస్టయిన వారిలో ఇంకా 30 మంది వరకూ జైళ్లలో ఉండగా, మరో 50 మందికి పైగా జియో ట్యాగ్ అరెస్ట్ లతో బయట తిరుగుతున్నారు.