Chandrababu: నాడు వారు చెప్పినట్టే ప్యాకేజీకి మార్పులు చేశాం.. ధన్యవాదాలు తెలుపుతూ చంద్రబాబు లేఖ కూడా రాశారు!: కేంద్రమంత్రి పీయూష్ గోయల్

  • విజయసాయి ప్రశ్నకు సమాధానమిచ్చిన పీయూష్
  • ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది 
  • 2016లో చంద్రబాబు స్వాగతించారు  
ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయంగా 2016 అక్టోబర్‌లో కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీని ఏపీ సీఎం చంద్రబాబు స్వాగతించారని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. నేడు రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. నాడు రాష్ట్ర ప్రభుత్వం సూచించిన మార్పులన్నీ ప్యాకేజీలో చేశామని.. దానికి కేంద్ర కేబినెట్ కూడా ఆమోదం తెలిపిందన్నారు. దీంతో ఏపీ సీఎం చంద్రబాబు 2017 మే 2న ధన్యవాదాలు తెలుపుతూ.. కేంద్ర ఆర్థిక మంత్రికి లేఖ రాశారని పీయూష్  గోయల్ తెలిపారు
Chandrababu
Piyush Ghoyal
Vijayasai reddy
YSRCP
Rajyasabha
Central Cabinet

More Telugu News