modi: మోదీ ఇప్పటికైనా స్పందించకపోతే.. తీవ్ర పరిణామాలు తప్పవు: చంద్రబాబు

  • ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు
  • మనోభావాలతో చెలగాటమాడుతున్నారు
  • ప్రజల తరపున నిరసన తెలుపుతూ పాదయాత్ర చేస్తున్నాం
ప్రధాని మోదీ చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. ఢిల్లీలో పాదయాత్ర సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల జీవితాలతో మోదీ ఆడుకుంటున్నారని అన్నారు. మనోభావాలతో చెలగాటమాడుతున్నారని చెప్పారు. ఇలాంటి పద్ధతి సరికాదని... అందుకే ప్రజల తరపున నిరసన తెలుపుతూ ఢిల్లీ నడివీధుల్లో పాదయాత్ర చేస్తున్నామని అన్నారు. ఇప్పటికైనా మోదీ సరైన రీతిలో స్పందించకపోతే... పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, ఈ విషయాన్ని మోదీ గమనించాలని చెప్పారు.
modi
Chandrababu
bjp
Telugudesam

More Telugu News