Jagapatibabu: 'సైరా'లో వీరారెడ్డిగా జగపతిబాబు... లుక్ అదుర్స్!

  • చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న 'సైరా'
  • రెడ్డి రాజు పాత్రలో నటిస్తున్న జగపతిబాబు
  • నేడు పుట్టినరోజు సందర్భంగా లుక్ విడుదల
చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న 'సైరా - నరసింహారెడ్డి'లో విలక్షణ నటుడు జగపతిబాబు ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నేడు జగపతిబాబు పుట్టినరోజు కాగా, ఈ సందర్భంగా చిత్రంలోని ఆయన లుక్ ను, మోషన్ టీజర్ ను యూనిట్ విడుదల చేసింది. 'సైరా'లో జగపతిబాబు వీరారెడ్డి పాత్రలో నటిస్తున్నారని చెబుతూ జన్మదిన శుభాకాంక్షలు చెప్పింది. ఇందులో జగపతిబాబు రెడ్డి రాజుగా నటిస్తున్నట్టు తెలుస్తుండగా, గుబురు గడ్డం, పొడవైన జుట్టు, తలపాగా, నుదుటన కుంకుమతో జగపతిబాబు 'అదుర్స్' అనేలా కనిపిస్తున్నారని ఫ్యాన్స్ కితాబిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. 


Jagapatibabu
Sairaa
Chiranjeevi

More Telugu News