Chandrababu: కేంద్రంపై మరింత ఒత్తిడి తెచ్చేందుకు చంద్రబాబు దూకుడు!

  • నిన్న ఏపీ భవన్ వేదికగా ధర్మపోరాట దీక్ష
  • విజయవంతం కావడంతో కేంద్రంపై ఒత్తిడి పెంచే వ్యూహం
  • నేడు పాదయాత్రగా రాష్ట్రపతి భవన్ కు
సోమవారం నాడు ఏపీ భవన్ వేదికగా తెలుగుదేశం పార్టీ తలపెట్టిన ధర్మపోరాట దీక్ష విజయవంతం కావడం, ఈ దీక్షకు పలువురు జాతీయ పార్టీల నాయకులు వచ్చి సంఘీభావం తెలపడంతో, చంద్రబాబు కేంద్రంపై మరింత ఒత్తిడి తెచ్చే దిశగా దూకుడు పెంచారు. నేడు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిసేందుకు అపాయింట్ మెంట్ లభించడంతో, ఏపీ భవన్ నుంచి రాష్ట్రపతి నివాసం వరకూ పాదయాత్ర చేయాలని ఆయన నిర్ణయించారు.

ఈ క్రమంలో ఈ ఉదయం 10 గంటల సమయంలో తెలుగుదేశం నేతలు, ప్రజా ప్రతినిధులతో సమావేశం అయ్యే ఆయన, ఆపై కొద్దిమందితో కలిసి పాదయాత్ర ప్రారంభిస్తారు. పాదయాత్ర మధ్యలో పలువురు జాతీయ నాయకులు ఆయన్ను కలుస్తారని టీడీపీ వర్గాలు వెల్లడించాయి. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో చంద్రబాబు రాష్ట్రపతిని కలుస్తారు. విభజన హామీలను నెరవేర్చాలని మెమొరాండాన్ని సమర్పిస్తారు.
Chandrababu
New Delhi
President Of India
Ramnath Kovind

More Telugu News